ఏప్రిల్ 7న భారత్ లో ఏంట్రీ ఇవ్వనున్న Realme GT 2 Pro.. ఫీచర్స్ ఇవే..!

-

Realme GT 2 Pro ఏప్రిల్ 7న భారత్ లో విడుదల కానుంది. చైనాలో జనవరిలో లాంచ్ అయిన ఈ మొబైల్ ఇప్పుడు భారత్‌కు రానుంది. లగ్జరీ ఐకాన్ గా ఈ ఫోన్ కూడా నిలవనుంది. కొత్త ఫోన్ కొనలానుకునేవారు… ఓసారి Realme GT 2 Proపై లుక్కేయండి. మంచి ఫీచర్స్ తో అదిరిపోయే ధరతో ఫోన్ అయితే మంచి కాస్ట్లిలుక్ తో కళకళలాడుతోంది. ఈరోజు మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూద్దామా.!

Realme GT 2 Pro ధర:

చైనాలో విడుదలైన ధరకే భారత్‌లోనూ రియల్‌మీ జీటీ 2 ప్రో మొబైల్‌ వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణుల అభిప్రాయం. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి..

8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో 3,899 (సుమారు రూ.46,700)గా ఉంది. ఇండియాలోనూ దాదాపు అదే ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

12జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 (దాదాపు రూ.51,500), 12జీబీ ర్యామ్ + 512 స్టోరేజ్ టాప్‌ వేరియంట్ ధర 4,799 (సుమారు రూ.57,500)కు లాంచ్ అయింది.

Realme GT 2 Pro హైలెట్స్ :

రియల్‌మీ జీటీ 2 ప్రో మొబైల్‌ 6.7 ఇంచుల 2K LTPO AMOLED సూపర్ రియాలిటీ డిస్‌ప్లేతో వస్తోంది.

120Hz అడాప్టివ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది.

క్వాల్‌కామ్‌ లేటెస్ట్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ రన్ అవుతుంది.

గరిష్ఠంగా 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

కెమేరా విషయానికి వస్తే..

రియల్‌మీ జీటీ 2 ప్రో వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 MP Sony IMX766 ప్రధాన కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ షూటర్, 2 MP మాక్రో సెన్సార్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ:

రియల్‌మీ జీటీ 2 ప్రోలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల సూపర్‌డార్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version