ఒన్ ఇండియా.. ఒన్ ట్యాక్స్ విధానం అమలు చేయాలని సూచించామని పేర్ని నాని అన్నారు. 11వ తేదీ నుంచి కొత్త కెబినెట్ రాబోతోంది….రవాణ శాఖకు ఎవరు మంత్రైనా నేను బస్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర ఒప్పందానికి సహకరించాలని తెలంగాణ లారీ ఓనర్ల సంఘం కోరింది…అంతర్రాష్ట్ర ఒప్పందం వల్ల తెలంగాణ లారీ ఓనర్లకు లాభం.. ఏపీకి నష్టం అన్నారు.
అయినా తెలంగాణ లారీ ఓనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒప్పందం చేసుకోవాలని మేం ముందుకు వచ్చినా.. తెలంగాణ అధికారులు సిద్దంగా లేరనీ వెల్లడించారు.ఒప్పందం చేసుకోవాలని హైదరాబాదుకే రావాలని ఏపీ అధికారులకు తెలంగాణ రవాణ కమిషనర్ చెప్పారనీ.దానికి మేం అంగీకరించినా.. తెలంగాణ రవాణా శాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాదులో తిరిగే ఏపీ బస్సులపై అనవసరంగా కేసులు రాయకుండా చూడాలని కోరుతున్నాం…ఇష్టానుసారంగా కేసులు రాస్తే.. ఏపీలోకి వచ్చే తెలంగాణ బస్సుల విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తమిళనాడులో ఇదే తరహాలో ఏపీ బస్సులపై కేసులు రాస్తే.. ఏపీలోకి వచ్చిన ప్రతి తమిళనాడు బస్ పైనా కేసు రాశామని చెప్పారు.