ఆ విషయంలో తప్పుగా అడిగిన రిపోర్టర్.. దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన రెజీనా.!

-

రెజీనా కసాండ్రా.. ఎన్నో సినిమాలతో పాటు మరెన్నో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ తో కలిసి తాను నటిస్తున్న షాకిని డాకిని సినిమా గత రెండు సంవత్సరాలు క్రితమే విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న రెజీనా రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు ఇబ్బంది పడి అతడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

అడ్వెంచర్ స్టోరీ తో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలోకి రానుంది.. సినిమా ప్రమోట్ చేయడానికి పెట్టిన ప్రెస్మీట్లో ఒక రిపోర్టర్ వింత ప్రశ్న అడిగారు. దీంతో హీరోయిన్ రెజీనా అతనిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే సినీ సెలబ్రిటీలకు అప్పుడప్పుడు రిపోర్టర్ల నుంచి కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది వాటికి సమాధానం ఇస్తే.. మరికొంతమంది సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి సంఘటన హీరోయిన్ రెజీనా విషయంలో కూడా జరిగింది. ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ ఇందులో మీ పాత్రకు ఓసిడి ఉంది. రియల్ లైఫ్ లో కూడా మీకు ఓసిడి ఉందా అని రిపోర్టర్ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఈమె.. సినిమాలో అమ్మాయిల గురించి గొప్పగా చూపించాము. వాటి గురించి కాకుండా ఇలాంటి ప్రశ్నలా అడిగేది. అంటూ ఆమె ఫైర్ అయ్యింది.

ఇక తాను పరిశుభ్రంగా ఉంటాను అని, ఓసిడి లాంటివి ఏం లేవని చెప్పింది. అలాగే అమ్మాయిలకు పీరియడ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా పరిశుభ్రతతో ఉంటాము అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్నలు అడగకండి అంటూ రెజినా క్లారిటీ ఇచ్చింది. నలుగురిలో అమ్మాయిలను ఇలా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంటూ రిపోర్టర్ కి గట్టిగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version