క‌రోనాపై స‌రికొత్త‌గా జాగ్ర‌త్త‌లు చెప్పిన ఆర్ఆర్ఆర్ టీం

-

దేశంలో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తున్న‌టైమ్ లో చాలా మంది స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఇక సినీ సెల‌బ్రిటీలు కూడా త‌మ‌దైన స్టైల్ లో జాగ్ర‌త్త‌లు చెబుతూ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఇక ఇదే బాట‌లో ఆర్ ఆర్ ఆర్ సినిమా టీం కూడా వినూత్నంగా క‌రోనా జాగ్ర‌త్త‌లు తెలిపింది.

ఈ మేర‌కు మూవీ టీం #STAND TOGETHER యాష్ ట్యాగ్ తో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళి, ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్ లు ఉన్నారు. ఐదు భాష‌ల్లో ఈ వీడియోను రూపొందించారు. ఆలియా భ‌ట్ తెలుగులో, రామ్ చ‌ర‌ణ్ త‌మిళంలో, రాజ‌మౌళి మ‌ళ‌యాలంలో, అజ‌య్ దేవ‌గ‌న్ హిందీలో, ఎన్టీఆర్ క‌న్న‌డ భాష‌ల్లో మాట్లాడుతూ జాగ్ర‌త్త‌లు తెలిపారు.

క‌రోనా నివార‌ణ‌కు వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని, అంద‌రూ వ్యాక్సిన్ వేసుకోవాల‌ని సూచించారు. నిత్యం శానిటైర్ వాడాల‌ని, అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని కోరారు. ఇక చివ‌ర‌గా మాస్కు ధ‌రిద్దాం, వ్యాక్సిన్ వేసుకుందాం అంటూ వీడియోను ఎండ్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వారు కోరారు. ఈ వీడియో కొద్ది నిముషాల్లోనే వైర‌ల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version