లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కవుట్ అవ్వాలంటే పాటించాల్సిన కొన్ని నియమాలు

-

వాట్సాప్ లో మెసేజ్ చేసుకోవడం, అవసరమైనప్పుడు వీడియో కాల్ చేయడం వంటి వాటి ద్వారా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ రిలేషన్షిప్ ఎన్ని రోజుల వరకు స్ట్రాంగ్ గా ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కి వెళ్తున్నానని ఎవరికైనా చెబితే కచ్చితంగా వాళ్ళు వద్దని చెబుతారు.

భౌతికంగా కలిసే అవకాశం లేని బంధాలు ఎక్కువ రోజులు నిలబడవని, దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు కచ్చితంగా ఎదురవుతాయని ఎమోషనల్ గా హర్ట్ అవ్వాల్సి వస్తుందని సలహాలు ఇస్తారు.

ప్రస్తుతం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్క్ అవుట్ అవ్వాలంటే పాటించాల్సిన కొన్ని రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

కమ్యూనికేషన్ తగ్గించండి:

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ ప్రధానం కదా మరి కమ్యూనికేషన్ తగ్గిస్తే ఎలా అని అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి. అవతల వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే.. వాళ్లతో ఇంకా మాట్లాడాలి, వాళ్ళను కలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా పెరుగుతుంది. ఆ కోరిక నీలో ఎన్ని రోజులు సజీవంగా ఉంటుందో అన్ని రోజులు నీకు అవతలి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది.

క్రియేటివ్ గా కమ్యూనికేట్ చేయండి:

కాల్స్ మాట్లాడడేటప్పుడు క్రియేటివ్ గా ఉండాలి. ప్రతిసారి ఒకే రకంగా మాట్లాడితే అవతలి వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. సో.. బి క్రియేటివ్.

ఆన్ లైన్ గేమ్స్ ఆడండి:

ఇద్దరూ కలిసి ఆన్ లైన్ గేమ్ ఆడటమో, లేకపోతే యూట్యూబ్లో ఒకే వీడియో చూడటమో.. లేదా ఆన్ లైన్లో ఇద్దరూ కలిసి షాపింగ్ చేయటమో చేయాలి. దీనివల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది.

అనుమానాలు వద్దు:

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఇద్దరూ దూరంగా ఉంటారు కాబట్టి అనవసరమైన అనుమానాలతోని అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టవద్దు. కొన్నిసార్లు మీరు కాల్ చేసినా వాళ్లు లిఫ్ట్ చేయకపోవచ్చు. అటువంటప్పుడు దాన్ని లైట్ తీసుకుని ఉండాలి తప్పితే.. గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా చేస్తే రిలేషన్షిప్ చెడిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version