హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రక్రియను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. హెచ్ సీయూ భూముల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే త్వరలోనే వీరికీ కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ చెప్పారని, తక్షణమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. విద్యార్థుల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ తరఫున ఎంపీ ఈటల భరోసా ఇచ్చారు.