చదువుకోని వారు ప్రధానులైతే ఇలాగే ఉంటది: భట్టి విక్రమార్క

-

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకపోవడం శోచనీయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపి.. విప్లవాత్మక మార్పుకు కృషి చేసిన ఎన్టీఆర్.. యావత్ తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు.

భట్టి విక్రమార్క

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయుల ఫోటోలు లేకుండా ఆజాదీ కా అమృత్ మహోత్సవం చేపట్టడం సిగ్గుచేటన్నారు. కేంద్ర వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో నిరసన ప్రదర్శన చేపట్టామని, కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని, చదువుకోని వారి చేతుల్లో దేశాన్ని పెడితే ఇలాగే ఉంటుందని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version