జూన్ 6న చైనాలో లాంచ్ కానున్న Vivo T2x.. ముందే లీకైన ఫీచర్స్..

-

Vivo T2x చైనాలా జూన్ 6న లాంఛ్ కానుంది. లాంచ్ కు ముందే ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని తేలింది. అదే రోజు వీవో టీ2 5జీ ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ రెండు ఫోన్ల ఫీచర్స్ ఎలా ఉన్నాయి, హైలెట్స్ ఎంటో చూద్దామా..!

వివో టీ2 5జీ ఫీచర్లు..

వివో టీ2 5జీ ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా… యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు.
ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమేరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఓషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
5జీ, వైఫై6, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

వివో టీ2ఎక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా)

లీకైన వివరాల ప్రకారం… ఇందులో 6.58 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ ఉండనుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు.
దీని మందం 0.92 సెంటీమీటర్లు గానూ, బరువు 202 గ్రాములుగానూ ఉంది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుందని సమాచారం. దీంతోపాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

వివో టీ2ఎక్స్ ధర..

1,000 యువాన్ల (సుమారు రూ.11,500) రేంజ్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర ఉండనుందని టెక్ నిపుణుల అంచనా… బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్ ప్రధానంగా ఈ ఫోన్ రూపొందించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version