పెద్దిరెడ్డికి షాక్‌…అటవీ భూములపై పవన్‌ కళ్యాణ్‌ కీలక ఆదేశాలు !

-

పెద్దిరెడ్డికి షాక్‌…అటవీ భూములపై పవన్‌ కళ్యాణ్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు ప్రిన్సిపల్ ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్.

pawan kalyan key orders over peddireddy

పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని ఆదేశించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదికలో పేర్కొనాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్ ను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version