తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రతీకార చర్యల వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ప్రొటోకాల్ రగడ నానాటికీ పెరిగిపోతున్నది .తాజాగా మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ పేరు పెట్టలేదని శిలాఫలకాన్ని బీజేపీ నాయకులు కూల్చివేశారు.
అయితే, హైదరాబాద్ – ఎన్జీవోస్ కాలనీలో కొత్త గ్రంథాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పేరు లేదని.. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనేపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి సంయుక్తంగా శిలాఫలకాన్ని కూల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈటెల రాజేందర్ పేరు పెట్టలేదని శిలాఫలకాన్ని కూల్చివేసిన బీజేపీ నాయకులు
హైదరాబాద్ – ఎన్జీవోస్ కాలనీలో కొత్త గ్రంథాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పేరు లేదని.. శిలాఫలకాన్ని కూల్చివేసిన రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనేపల్లి… pic.twitter.com/Y2V9Q60eSU
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2025