తెలంగాణలో మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా కృషి చేస్తున్నది. ఈ క్రమంలోనే డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దింపింది.ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, ఇతర పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో వాహనాలను ఆపి మరి చెక్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్వోటీ పోలీసులు ఎల్బీనగర్లో తనిఖీలు నిర్వహించారు. యువతకు డ్రగ్స్ అమ్ముతున్న అజయ్, జైపార్ రాజ్, రిక్కి, రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు నిర్దారించారు. వారి నుంచి నిషేధిత డగ్స్, కారు, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.