తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్ పద్దులను ఆయన చదివి వినిపిస్తున్నారు. సభలోని సభ్యులు అందరికీ బడ్జెట్ కాపీలను అందజేశారు. ఈసారి వాస్తవ అంచనాలతో బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు.
అయితే, వచ్చే పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తామని భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు కార్యాచరణం చేపడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దెందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.