జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మ్యాడ్ స్కోర్. 2023లో మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వస్తుండటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించింది. అందులో భాగంగా తాజాగా టీజర్ ను విడుదల చేసింది.
ఈ టీజర్ లో నార్నె నితిన్, రామ్ నిత్, సంగీత్ శోభన్ లు తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. పెళ్లి సందర్భంలో పంతులు గారు బాబు అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పండి అనగానే స్వీట్ పెట్టి సోను పాపుడీ చెబుతాడు. దీంతో స్వీట్ పేరు కాదు.. అమ్మాయి పేరు అనే కామెడీ ఆకట్టుకుంటోంది. చిన్నాన్న, పెద్దనాన్న కామెడీ ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.