కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

-

కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇవాళ హైదరాబాద్ లో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పై పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి గంగుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గంగుల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,15,901 రేషన్ కార్డుల ధరఖాస్తుల విచారణ, నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్ఐసి, టిఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ద్రువీకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

గత పదిహేను రోజులుగా జిల్లా స్థాయిలో రెవెన్యూతో పాటు ఇతర సిబ్బంది, రాజదానిలో జిహెచ్ఎంసీతో పాటు ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతీ అర్హుడిని గుర్తించడం కోసం జిల్లా కలెక్టర్లు, డిసిఎస్వోలు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నూతన కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడినా సిద్దంగా ఉన్నామని.. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ పేదవాని ఆకలిని తీర్చడానికే నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version