గెటప్ శ్రీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ ట్రైలర్ వచ్చేసింది

-

జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ గెటప్ శ్రీను.. టీవీలో సక్సెస్ అయి ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీ అయ్యాడు. సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. గెటప్ శ్రీను హీరోగా, అంకిత ఖారత్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వంలో ‘రాజు యాదవ్’ అనే సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే రాజు యాదవ్ టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. నేడు రాజు యాదవ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా తేజ సజ్జ గెస్ట్ గా వచ్చి ట్రైలర్ రిలీజ్ చేసారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు మూతి మీద బాల్ తగిలి లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండేలా హీరో ఫేస్ మారిపోతుంది. ఆపరేషన్ చేయిస్తే మాములుగా మారుతుంది కానీ డబ్బుల్లేక అలా వదిలేయడంతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అతని నవ్వు వల్ల వచ్చిన సమస్యలు, ఆ నవ్వు వల్ల వచ్చే లవ్ స్టోరీతో.. ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇంకెందుకు ఆలస్యం ఇక మీరు కూడా  చూసేయండి రాజు యాదవ్ ట్రైలర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version