విషాదంగా మారిన విహారయాత్ర.. నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్

-

విహారయాత్ర కాస్త విషాదంగా ముగిసింది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్ అనన్య రావు నదిలో కొట్టుకుపోయింది. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో గల తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకిన మహిళా డాక్టర్.. ప్రవాహం ఉధృతి ఎక్కువగా ఉండటంతో నదిలో కొట్టుకుపోయింది.

తోటి స్నేహితుల సమాచారం మేరకు అనన్య రావు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తెలియడంతో మహిళా డాక్టర్ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news