వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ నాయకుడు పెండేం రామానంద్ అనుచరులు విలేకరులపై దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తనకు వ్యతిరేకంగా వార్తలు ఎలా రాస్తావని సదరు కాంగ్రెస్ నాయకుడి అనుచరులు దాడికి పాల్పడ్డారు.
ఇదంతా స్థానికంగా ఆఫీసర్ నిర్లక్ష్యం, రౌడీలుగా వ్యవహరించే వారికి దగ్గరగా ఉండటంతో ఇలా జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు.
కాగా, ఓ ప్రముఖ దినపత్రికలో ‘స్టేషన్‌ను శాసిస్తున్న రామ లక్ష్మణులు’అనే హెడ్డింగుతో వార్త రాయగా.. ఆ కథనాన్ని తాను అపాదించుకుని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆ వార్త రాసిన విలేకరికి ఉదయమే కాల్ చేసి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. విలేకరి వ్యాపార సంస్థకు తన అనుచరులతో వచ్చి అతని ద్విచక్ర వాహనాన్ని అపహరించి..అనంతరం వ్యాపార సంస్థ పైకి సుమారు 12 మంది అనుచరులను పంపి బెదిరించినట్లు తెలిసింది.
https://twitter.com/TeluguScribe/status/1892456174018244911