ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు.. వికసించటానికే నాలుగు రోజులు పడుతుందట

-

ఈ ప్రకృతి ఓ అందమైన నిలయం.. ఎన్నో వింతలు..మరెన్నో విశేషాలు.. ప్రకృతిని ప్రేమించే కళ్లతో చూస్తేనే అవి అందంగా కనపిస్తాయి. లేకపోతే వాటి అందాన్ని మనం ఎప్పటికీ గుర్తించలేం. పువ్వలు అంటే ఇష్టపడని వారంటూ ఉండరూ. పెట్టుకోకపోయినా వాటిని చూసినా, పెంచినా మనసుకు ఒక ఆనందం.ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ఏమిటో తెలుసా..? ఈ పువ్వు వికసించడానికి దాదాపు నాలుగు రోజులు పడుతుందట.. అంతేకాదు ఈ పువ్వునుంచి వచ్చే వాసనను భరించలేక దూరంగా పారిపోతారట..

ఓ వ్యక్తి ఇండోనేషియాలోని ఓ అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అరుదైన ప్రకృతి వింత కనిపించింది…శవం కుళ్ళిన వాసన వస్తుంటే.. అది ఏమిటా అని పరిశీలించిన అతనికి ప్రపంచంలో అతి పెద్ద పువ్వు కనిపించింది. ఈ పువ్వు రాఫ్లేసియా ఆర్నాల్డి.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు…ఈ పువ్వు వికసించే సమయంలో విపరీతమైన దుర్వాసనకు వెదజల్లడం వల్లే ఇది ఇంత ప్రసిద్ధి చెందింది.

3 అడుగుల వరకు వికసిస్తుంది. 15 పౌండ్ల వరకు బరువు ఉంటుందట… నౌ దిస్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో అడవుల్లో నేలపై ఉంది. ఈ భారీ పుష్పం ఐదు ఎర్రటి రేకులను కలిగి ఉంది. పూర్తిగా వికసించింది. ఎర్రటి రేకుల మీద తెల్లటి మచ్చలతో చూడడానికి భలే గమ్మత్తుగా ఉంది. ఈ పుష్పం వికసించడానికి దాదాపు నాలుగు రోజులు పడుతుంది. దీని రేకలు అంత పెద్దగా ఉంటాయి మరి.

ప్రస్తుతం ఈ పువ్వు వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత.. ప్రపంచంలోని చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన అనేక మంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారు చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పుష్పం గ్రహంతర వాసుల నుంచి వచ్చిందా? అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీకు ఈ పువ్వును చూశాక ఏం అనిపించిందో..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version