బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిని చంపిన బాలీవుడ్ హీరోయిన్ చెల్లెలు

-

పాకిస్తాన్‌కు చెందిన నటి నర్గీస్ ఫక్రీ ఇండియాకు వచ్చి బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ‘రాక్ స్టార్’ మూవీలో హీరో రణబీర్ కపూర్ సరసన ఆమె హీరోయిన్‌గా లీడ్ రోల్ చేసింది. నర్గీస్ ఫక్రీ చెల్లెలు ఆలియా ఫక్రీ ప్రస్తుతం ఓ హత్యా కేసులో చిక్కుకున్నారు. ఆమె పేరు మీద అమెరికాలో కేసు నమోదైంది.

ఆలియా ఫక్రీ (43) తన మాజీ ప్రియుడు జాకబ్ (35), అతని ఫ్రెండ్ ఎటినీ(33) ఉంటున్న గ్యారేజ్‌ను నవంబర్ 2న తగలబెట్టారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ మరణించారు. ఏడాది క్రిందట అతడు బ్రేకప్ చెప్పినా ఆమె అంగీకరించలేదని తెలిసింది. ఆ కోపంతోనే రగిలిపోతున్న ఆలియా ‘మీరు ఈరోజు నా చేతిలో చచ్చారు’ అని అరుస్తూ గ్యారేజికి నిప్పంటించినట్లు సాక్షులు చెప్పడంతో న్యూయాక్క్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news