Mudragada son Giri gets key post in ycp party: ముద్రగడ కుమారుడు గిరికి కీలక పదవి ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో మూడు దశాబ్దాల తర్వాత ప్రత్తిపాడు పాలిటిక్స్ లోకి ముద్రగడ కుటుంబం ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ముద్రగడ కుమారుడు గిరికి ప్రత్తిపాడు పార్టీ బాధ్యతలు అప్పగించిన వైసిపి.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
1994లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ, అప్పటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా, 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేశారు ముద్రగడ. 1994లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ, అప్పటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత ప్రత్తిపాడు పాలిటిక్స్ లోకి ముద్రగడ కుటుంబం ఎంట్రీ ఇవ్వనుంది. కాగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీలో చేరి.. జగన్ కోసం ప్రచారం చేశారు ముద్రగడ. కానీ పరాభవం తప్పలేదు.