హిందూ దేవుళ్ళకు వాహనాలు ఉంటాయన్న విషయం తెలిసిందే.. ఒక్కో దేవుడుకు ఒక్కో వాహనం ఉంటుంది. శివుడు ఉన్న చోటు ఖచ్చితంగా నంది విగ్రహం ఉంటుంది.కానీ మన దేశంలోని మహారాష్ట్ర లోని ఓ ప్రముఖ శివాలయంలో మాత్రం అస్సలు నంది ప్రతిమ లేదట..దానికి కారణం కూడా ఉంది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
అయితే ఓ రోజు ఆ తల శివుడిని తప్పుగా అంది. దానికి ఆగ్రహంతో ఊగిపోయిన పరమ శివుడు ఆ 5వ ముఖాన్ని బ్రహ్మ నుంచి వేరు చేశాడు. అలా ఈశ్వరుడికి బ్రహ్మ హత్య పాపం తగిలింది. ఆ పాపం పోగొట్టుకోవడానికి సోమేశ్వరంలోని ఒక దూడ శివుడికి పరిహారం చెప్పింది. ఈ దూడ మీద కూడా బ్రహ్మణుడైన తన యజమానిని చంపిందనే పాపం ఉందట.
బ్రహ్మను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి దూడ తాను చేసిన పరిహారాన్ని శివుడికి చెప్పింది. నాసిక్ సమీపంలోని రామ్‌కుండ్‌లో స్నానం చేయమని శివుడిని సూచించింది. ఆ తరువాత ఈశ్వరుడు.. ఆ దూడను(నంది)ని తన గురువుగా స్వీకరించాట. దీని ప్రకారం.. నంది ఇక్కడ మహాదేవునికి గురువు అయినందున, ఈ ఆలయంలో నందిని తన ముందు కూర్చోబెట్టడానికి నిరాకరించాడు.. ఆనాటి నుంచి నేటి వరకూ ఆ ఆలయంలో నంది విగ్రహం లేదు..