ఆ నాటకం ప్రభావంతో ఇండస్ట్రీకొచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..ఎవరంటే?

-

సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా, దర్శకుడిగా, హీరోయిన్ గా స్థిరపడాలని చాలా మంది అనుకుంటారు. అలా అనుకుని సినిమాల్లోకి వస్తే అవకాశాలు అంత సులువుగా అయితే లభించవు. తమ ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం అయితే కావాల్సి ఉంటుంది. ఇక నాటకాల నుంచి వచ్చి సినిమాల్లో స్థిరపడ్డ వారున్నారు.

sobhan babu shobhan babu

అలా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, రవితేజ, నాని తదితరులు ఇండస్ట్రీలో ఎటువంటి అండ లేకున్నా తమ ప్రతిభతో తమకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలు..శోభన్ బాబు, కృష్ణ, మురళీ మోహన్ ముగ్గురూ ఒకే ఒక నాటకం ప్రభావం వలన ఇండస్ట్రీకి వచ్చారు. ఆ సంగతులు ఇక్కడ తెలుసుకుందాం.

డిగ్రీ చదువుకునే విద్యార్థులు అయిన ముగ్గురు కలిసి ఒక నాటకం వేశారు. ఆ నాటకం పేరు ‘పునర్జన్మ’. కాగా, ఇది సూపర్ హిట్ అయింది. ఇందులో నటించిన వారు తర్వాత స్టార్ హీరోలు అయ్యారు.
ఈ నాటకం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సినిమా హీరోలు కావాలని వారు అనుకున్నారు. వారి కృషి వలన వారు చిత్రసీమ గర్వించే నటులయ్యారు. వారే శోభన్ బాబు, కృష్ణ, మురళీ మోహన్.

ఆ ముగ్గురిలో శోభన్ బాబు దివంగతులయ్యారు. కాగా, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. వృద్ధాప్యం వలన కృష్ణ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. మురళీ మోహన్ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు.

ఒకే ఒక నాటకం ప్రభావం వలన ఈ ముగ్గురు స్టార్ హీరోలు తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చారన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. కానీ, అదే జరిగింది. అలా వీరు చిత్ర సీమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version