ప్రతి ఒక్కరికి వాట్సాప్ బాగా అలవాటైపోయింది. కానీ మీకు వాట్స్ ఆప్ వాడాలని లేదా..? అయితే వాటికి బదులుగా ఇవి వాడొచ్చు. ఈ యాప్స్ కూడా వాట్సాప్ లాగే మనకి హెల్ప్ అవుతాయి. అయితే మరి వాట్సప్ వాడాలని లేనివాళ్లు ఈ యాప్ ని ఉపయోగించవచ్చు మరి ఆ యాప్ గురించి ఇప్పుడు చూద్దాం.
సిగ్నల్ యాప్:
ఈ యాప్ చాలా బాగుంటుంది. ఈ యాప్ లో స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా స్క్రీన్ సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. గరిష్ఠంగా 40 మంది యాక్టివ్ యూజర్లతో సురక్షితంగా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. కానీ వాట్సాప్ లో అయితే వీడియో కాల్ మాట్లాడుకోవడానికి కేవలం ఎనిమిది మంది వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.
టెలిగ్రామ్:
టెలిగ్రామ్ కూడా మంచి యాప్. టెలిగ్రామ్ లో లక్ష మంది వ్యక్తులతో పబ్లిక్ ఛానల్ సూపర్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడానికి అవుతుంది. మినీ గేమ్స్ కూడా ఈ
యాప్ లో ఉంటాయి. త్రిబుల్ లేయర్ కాన్ఫిగరేషన్ భద్రత కూడా ఈ యాప్ ద్వారా మనం పొందొచ్చు.
డిస్కార్డ్:
గేమ్ ల కోసం ఈ యాప్ ని తీసుకు వచ్చారు. అయితే ఇప్పుడు రోజు వారీ పనుల కోసం కూడా దీనిని వాడుతున్నారు. ఒక సందేశాన్ని 8mb వరకు షేర్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 100mb వరకు ఉంటుంది.
ఐ మెసేజ్:
ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు ఐ మెసేజ్ ఆప్ ఇన్ బిల్డ్ గా వస్తుంది. చాలా మంది ఈ యాప్ ని ఉపయోగిస్తున్నారు. ఎండ్ టు ఎండ్ ద్వారా మీ సంభాషణలకు భద్రత లభిస్తుంది.
గూగుల్ చాట్:
యాక్సిస్ చేయడం చాలా ఈజీ అలానే వాట్సాప్ లాగే ఇది పనిచేస్తుంది. ఫైల్ షేరింగ్, పబ్లిక్ మీటింగ్ వంటివి ఈజీగా అవుతాయి.