మనం చేసే పనులే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాలే దక్కుతాయి. అందుకే మనం అలవర్చుకునే అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంటే బాగుంటుంది. ఐతే అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అందరికీ తెలియదు. కొన్ని సార్లు మామూలుగా అన్నీ నేర్చేసుకుంటాం. అలా నేర్చుకున్న వాటిల్లో నుండి మనకి అవసరం లేని వాటిని తొందరగా మర్చిపోవాలి. అలా మర్చిపోవాల్సిన అలవాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీసారీ ప్లీజ్ అనకండి
అవతలి వారు ఒక్కసారి కాదన్నారంటే కాదనే అర్థం. అనవసరంగా ప్రతీసారీ ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలకండి. అలా బతిమాలితే మీరెక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఫలితాల మీద వారికి ఎక్కువ అంచనాలు ఉంటాయి. అందుకే ప్లీజ్, ప్లీజ్ అని అడక్కండి.
దృష్టి మరల్చే విషయాలను తుంగలో తొక్కండి
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సరైన దృష్టి చాలా అవసరం. మీ దృష్టిని పక్కకి తిప్పే విషయమేదైనా వాటికి దూరం అవ్వండి. లేదంటే తాత్కాలిక ఆనందం ఇచ్చేవాటిలోనే జీవితాన్ని గడిపి శాశ్వత ఆనందాన్ని దూరం చేసుకుంటారు.
అందర్నీ నమ్మవద్దు
దీనర్థం వారిపైనే నమ్మకం పెట్టుకుని, వారు చేస్తారని చెప్పి మీరేమీ చెయ్యకుండా ఉండడం. ఈ ప్రపంచంలో ఎవరి పనులని వారే చేసుకోవాలి. అవతలి వారికి ఇంచుమందం లాభం లేకుండా ఏ పని మీకు చేసి పెట్టరు.
తక్కువ టైమ్ లో వచ్చే సంతృప్తి కోసం వేచి చూడవద్దు.
అలా వచ్చినవన్నీ తక్కువ కాలం మాత్రమే ఉంటాయని గ్రహించండి. ఏమీ కృషి చేయకుండా వచ్చే ఆనందాలు ఎక్కువ కాలం ఉండవు.