రియల్ బిజినెస్ మ్యాన్స్ గా మారిన హీరోలు వీళ్లే..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా ఇతర యాక్టివిటీస్ పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్న హీరోలు చాలామంది ఉన్నారు. అలా రియల్ బిజినెస్ మ్యాన్ లుగా మారిన హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు:

ఈయన హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చూపిస్తున్నారు. దానికి తోడు తాను సంపాదించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ నిర్మాణంతోపాటు మల్టీప్లెక్స్ బిజినెస్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు థియేటర్ బిజినెస్ తో పాటు క్లాత్ బిజినెస్ కూడా షురూ చేశారు. ప్రస్తుతం ఈయనతో పాటు ఈయన భార్య కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది.

విజయ్ దేవరకొండ:

రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు క్లోత్స్ బిజినెస్ మొదలుపెట్టారు. రౌడీ బ్రాండ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మరొకవైపు మల్టీప్లెక్స్ నిర్మాణంలోకి కూడా వచ్చాడు. సొంతూరు మహబూబ్ నగర్లో ఏషియన్ ఫిలిమ్స్ తో కలిసి ఒక థియేటర్ నిర్మించాడు విజయ్. ఈమధ్య లవ్ స్టోరీ సినిమాతో ఇది ఓపెన్ అయ్యింది.

అల్లు అర్జున్:
అల్లు అర్జున్ కూడా హీరో గానే నటిస్తూ.. మరోవైపు బిజినెస్ చేస్తున్నారు. హైదరాబాదులోని ఈయనకు పబ్ కూడా ఉంది. ఆ మధ్య దీన్ని గ్రాండ్గా లాంచ్ చేశారు . ఇక అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో AAA పేరుతో ఒక మల్టీప్లెక్స్ నిర్మాణం కూడా జరుగుతోంది.

రామ్ చరణ్:

తండ్రి సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలు కూడా నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అంతేకాదు ఆ మధ్య ట్రూజెట్ ఎయిర్లైన్స్ కూడా మొదలుపెట్టాడు. దాంతోపాటు పోలో బిజినెస్ కూడా చేస్తున్నాడు. గుర్రాలు అంటే ఇష్టం ఉండడంతో ఈ బిజినెస్ లోకి దిగాడు రామ్ చరణ్.

నాగార్జున:
ఇటీవల కాలంలో ఈయనకు చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయి. మాటీవీలో కూడా కొన్ని ఏళ్ల పాటు భాగస్వామిగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక రేసింగ్ కంపెనీ తో పాటూ అలాగే ఫుట్బాల్ టీం కూడా ఓన్ చేసుకున్నాడు.

చిరంజీవి:
సచిన్ తో కలిసి ఫుట్బాల్ టీంను కూడా కొనుగోలు చేశారు . అంతే కాదు మరొక బిజినెస్ వైపు కూడా ఆయన అడుగులు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version