మార్కెట్‌కు వెళ్లిన సీతారామన్.. కూరగాయలు కొనడమేనా? ధరలూ తెలుసుకుంటున్నారా? ట్విట్టర్‌లో వార్!

-

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాత్రి చెన్నైలోని మైలాపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఆమె స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి.. కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన మంత్రి నిర్మలా సీతారామన్ ఓ దుకాణం దగ్గరికి వెళ్లి వ్యాపారితో ముచ్చటించారు. కూరగాయల ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె స్వయంగా కూరగాయలను కొనుగోలు చేశారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై పలువురు భిన్నంగా తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. చిన్న వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడలేదని పార్లమెంట్ కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం గతంలో చెప్పారని, మార్కెట్‌కు వెళ్లినప్పుడు డబ్బులు కూడా తీసుకెళ్లండని సలహా ఇస్తున్నారు. అలాగే కొందరూ కూరగాయలు కొనేటప్పుడు ధరలు కూడా తెలుసుకోమని అంటున్నారు. ధరలు కేంద్ర మంత్రి సాధారణంగా అనిపించినా.. సామాన్యులకు భారంగా ఉంటాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version