భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అభ్యర్థులకు ఈరోజు శాఖల కేటాయింపు జరుగుతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
* వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు
* డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
* డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్
* అన్ని ముఖ్యమైన పాలసీ వ్యవహారాలు
* ఇతరులెవ్వరికీ కేటాయించని శాఖలు
ఇతర పార్లమెంట్ అభ్యర్థులకు కేటాయించిన శాఖలు :
*సీఆర్ పాటిల్– జలశక్తి మంత్రిత్వ శాఖ
*చిరాగ్ పాస్వాన్- ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ,
*సర్బానంద్ సోనోవాల్- ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా
*అన్నపూర్ణ దేవీ- మహిళా శిశు సంక్షేమ శాఖ
*జితిన్ రామ్ మాంఝి- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
*జ్యోతిరాదిత్య సింధియా- కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ
* ప్రహ్లాద్ జోషి- ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు
* గిరిరాజ్ సింగ్- టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ