రాగులలో లభించే సహజ పోషకాలు ఇవే.!

-

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే చిరుధాన్యాలలో రాగులు ఒకటి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చాలామంది చాలా రకాల వంటలు చేసుకొని తింటుంటారు. కానీ అప్పట్లో మన పెద్దవారు రాగి జావా మరియు రాగి అంబలి, రాగి సంఘటిని ఎక్కువగా తీసుకునేవారు. రాగులలో కాల్షియం మరియు ఫైబర్ ,ప్రోటీన్లు,విటమిన్ ఎ, బి, సి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో రాగిజావ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. డిహైడ్రేషన్ సమస్యలకు పరిష్కారంగా రాగులు ఉపయోగపడుతాయి.రాగులలో ఉండే శక్తి అంతా ఇంతా కాదు. దీనిని ఆహారపరంగా కాకుండా ఔషధపరంగా కూడా వాడుకోవచ్చు. అలానే అనేక రకాలుగా అనేక వ్యాధులలో వాడుకోవచ్చు.

రాగులలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రాగిపిండితో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా బాగుంటుంది.అలాగే ఆహారం కూడా త్వరగా డైజెషన్ అవుతుంది. రాగులలో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ తాగడం మంచిది. రాగిమాల్ట్ ఎముకల పట్టుత్వానికి ఉపయోగపడుతుంది.

రాగులను నిత్యం మన ఆహారంలో తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా మరియు మృధువుగా ఉంటుంది.

రాగులలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.

షుగర్ వ్యాధికి రాగులతో చేసిన పదార్థాలు, రాగుల గంజి,పాలల్లో కలిపిన రాగులపానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులలో ఫైటో కెమికల్స్ అనే విటమిన్ ఉంటుంది. ఇది జీర్ణప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది.దాంతో షుగర్ వ్యాధి ఉన్న వారిలో చక్కర స్థాయిని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది.

రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మనం కాల్షియం తీసుకోవడం వల్ల మన ఎముకలకు, దంతాలకు పటిత్వం వచ్చి దృఢంగా మారుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version