ఈరోజుల్లో గార్డెనింగ్ చేయడం చాలామందికి అలవాటుగా మారిపోతుంది. ఇంట్లో కూడా చిన్న చిన్న మొక్కలను పెంచుకుంటున్నారు. ఎటూ చూసిన గ్రీన్ కలర్‌లో ఉండాలి. మొక్కలు కనిపించాలి అనుకుంటున్నారు.
మార్కెట్‌లో దొరికే వాటిని తెచ్చుకుని అందంగా అలంకరించుకుని పెంచుకుంటున్నారు. అయితే మొక్కల వల్ల అన్ని ప్రయోజనాలే ఉన్నప్పటికీ..కొన్ని మొక్కలు మన కొంపముంచుతాయి.. వీటి వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయట.. తెలిసీతెలియక ఈ మొక్కలు తెచ్చుకుంటే అంతే సంగతులు..ఇంతకీ అవి ఏంటంటే..
సక్యూలెంట్స్
సక్యూలెంట్స్ ప్లాంట్స్ వల్ల తెగుళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ మొక్కలు చిన్నగా, చూడటానికి అందంగా ఉంటాయి. చాలా మంది వీటిని తమ కార్యాలయాల్లో, డెస్కులపై పెంచుకుంటారు. అయితే ఈ మొక్కలు మీలీబగ్స్, కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ కీటకాలు ఇతర మొక్కలను కూడా వ్యాపిస్తాయి. కాబట్టి తెగుళ్లు లేకుండా చూసుకోవడం ముఖ్యం.
ఒలియాండర్
ఈ మొక్కలు విషపూరితమైనవి. ఒలియాండర్ లేదా నెరియం మొక్కల పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఈ పూలను పూజకు కూడా వాడుతుంటారు. ఈ పూల వల్ల వాంతులు, తలనొప్పి, గుండె సమస్యలు వస్తాయట.. ఈ మొక్కలు దారి వెంట కనిపిస్తే పిల్లలను దూరంగా ఉంచడం మంంచిది.
అరెకా
సక్యులెంట్స్ మొక్కల్లాగే అరెకా మొక్కలు కూడా తెగుళ్లను ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిని గోల్డెన్ కేన్ పామ్, ఎల్లో పామ్, బటర్‌ఫ్లై పామ్ అని కూడా అంటారు. ఈ మొక్కలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే కీటకాలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ మొక్కలపై సాలీడు పురుగులు బాగా ఉంటాయి.
బోన్సాయ్
బోన్సాయ్ చెట్లంటే చాలా మందికి ఇష్టమే. ఇవి చాలా చిన్నగా ఉండే వృక్షాలు. అయితే బోన్సాయ్ చెట్ల వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని తేలింది.. బోన్సాయ్ చెట్లను ఇంట్లో పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. ఈ మొక్కలను తాకి చేతులు కడుక్కోకుండా ఆహారపదార్థాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు..
మనీ ప్లాంట్
ఇది దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. మనీప్లాంట్ గాలిని కూడా శుభ్రం చేస్తుంది. అయితే ఈ ఆకులు తింటే కడుపులో చికాకుగా ఉంటుంది. వాంతులు, విరేచనాలు వస్తాయి. శ్వాసకోశ సమస్యలూ వస్తాయి. పెంపుడు జంతువులు ఈ మొక్కలను నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. జంతువుల్లో ఊపిరాడకపోవడం, శ్వాసకోశ సమస్యలు, మంట, విరేచనాలు, వాంతులు వస్తాయి. మూత్రపిండాల వైఫల్యం సహా ప్రాణం కూడా పోవచ్చు.