హైవోల్టేజ్‌ యాక్షన్‌తో ‘పఠాన్‌’ ట్రైలర్‌

-

బాలీవుడ్ బాద్‌షా దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్‌లో సందడి చేయడానికి వస్తున్నాడు. కింగ్ షారుఖ్ ఖాన్‌ హీరోగా..దీపికా పదుకొణే హీరోయిన్‌గా తెరకెక్కిన మూవీ పఠాన్. ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఇప్పటికే బాయ్‌కాట్ పఠాన్ అంటూ నెట్టింట్ రచ్చ నడుస్తోంది. ఈ మూవీలో బేషరమ్ రంగ్ సాంగ్.. ఆ పాటలో దీపిక వస్త్రధారణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేసింది చిత్రబృందం.

‘ఒక సైనికుడు తనకోసం దేశం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తాను ఏం చేయగలనా అని ఆలోచిస్తాడు’ అంటున్నారు షారుఖ్‌ఖాన్‌. ఆయన కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్’. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. హైవోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version