ఈ విషయాలు కరోనాతో పోరాడేటప్పుడు చాలా ముఖ్యం…!

-

గత వారం నాకు తెలిసిన ఒక ఉద్యోగి కుటుంబ సభ్యులకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో అతను కొంత మంది డాక్టర్లు సంప్రదించాడు. పలు మంది సలహాలు తీసుకున్నాడు. గతంలో ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి కూడా కాల్ చేసి అడిగారు.

అయితే అతనికి వచ్చిన సమస్య ఏమిటంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క జవాబులు వస్తున్నాయి. కొందరు ఆలస్యం లేకుండా ఆస్పత్రిలో అడ్మిట్ అయిపొమ్మని చెప్పారు. మరికొందరు పారాసెట్మాల్ తీసుకుని ఇంట్లోనే ఉండమన్నారు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్పడం జరిగింది. దీనితో అతను నిర్ణయం తీసుకోవడానికి నేను డాక్టర్ ని కాదు అందుకనే కొంతమంది డాక్టర్లు అడుగుతాను అని వారి సలహాలు కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. చాలా మంది ఈ సమయం లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరి నుంచి వివిధ రకాలుగా సలహాలు వస్తున్నాయి.

నాకు గతం లో పాజిటివ్ వచ్చింది. అయితే నా అనుభవం ప్రకారం నన్ను డాక్టర్ సిటి స్కాన్ తీయించుకోమన్నారు. నాకు కరోనా పాజిటివ్ నేను ఇంట్లోనే ఉంటున్నాను. దీనితో సీటీ స్కాన్ కి కుదరడంలేదు. అయితే మరొక డాక్టర్ ఆన్లైన్ లో కన్సల్ట్ చేసినప్పుడు chest x ray తీయించుకున్నారు. అయితే ఇది ఇంట్లో కూడా అవుతుంది. ఇంకొక డాక్టర్ అయితే ఏం కాదు డబ్బులు సమయాన్ని వృధా చేయొద్దు అన్నారు.

కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది. నాకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. శ్వాస కూడా ఆగేది మధ్య మధ్యలో. నేను డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఆమె పల్మనాలజిస్ట్ ని రిఫర్ చేశారు. ఆ తర్వాత ఒక డాక్టర్ నాకు మొత్తానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నాలుగు వారాల తర్వాత తిరిగి డాక్టర్ నన్ను chest x-ray తీశారు. ఆ తర్వాత వివిధ టెస్టులు కూడా చేసారు.

ఆ తర్వాత ఆరోగ్యం ఇంప్రూవ్ అయినట్లు చెప్పారు. సిటీ స్కాన్ తగ్గించుకోనా అని మళ్ళీ అడిగితే వద్దు దీని ద్వారా రేడియేషన్ ప్రభావం పడుతుందని చెప్పారు. అయితే ఇటువంటి కష్ట సమయం లో నిర్ణయాలు తీసుకోవడం సులభం కాదు. మన నిర్ణయం మనం తీసుకోవాలా లేదా డాక్టర్లు చెప్పినట్లు వినాలా అనే ఆలోచనలో పడిపోతాం.

ఎవరికి కూడా మనం సలహాలు ఇవ్వలేము. మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్పింది మాత్రమే పాటించడం ముఖ్యం. ఏది ఏమైనా సరైన సమయానికి మంచి మెడికల్ సలహాలు, కుటుంబ సభ్యులు స్నేహితులు తోటి ఉద్యోగస్తులు నుంచి సపోర్ట్, ఆఖరిగా అదృష్టం. ఎవరికైతే కరోనా పాజిటివ్ వస్తుందో వాళ్ళు దీనిని చదివి కాస్త ఆశతో ఉంటారని నాయొక్క ఎక్స్పీరియన్స్ పంచుకుంటున్నాను. ఇది వాళ్ళకి కాస్త పాజిటివిటీ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version