కేదార్ నాథ్ ఆలయానికి భక్తుల కంటే వారే ఎక్కువైపోతున్నారట!

-

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. అయితే ఇలా వచ్చేవారిలో భక్తుల కంటే ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, వ్లాగర్సే ఉంటున్నారని విమర్శలొస్తున్నాయి. దీంతో ఆలయం వద్ద భక్తిశ్రద్ధలు కరువయ్యాయంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. కేదార్నాథ్ వంటి ప్రదేశాలు ప్రకృతితో మమేకమై భక్తి పారవశ్యంలో మునిగిపోయే వారికోసమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవిత్ర స్థలాలకు 200 మీటర్ల లోపు మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని, యాత్రకు సంబంధించిన తప్పుదోవ పట్టించే వీడియోలు లేదా రీల్స్‌ను అప్‌లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు, రుద్రప్రయాగ్ పోలీసులు ‘ఆపరేషన్ మర్యాద’ను చేపట్టారు. ఇందులో భాగంగా కేదార్‌నాథ్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధామ్ ప్రాంతంలో మత్తు పదార్థాలు, మద్యాన్ని కట్టడి చేయడానికి, అలాగే యాత్రికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోడానికి ఈ ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు గుప్తకాశీ డి.ఎస్.పి.పి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version