వారు ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు : మధుయాష్కీ గౌడ్

-

రాష్ట్రంలో అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కాంగ్రెస్  నేత మధుయాష్కీ గౌడ్ కీలక
శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన అధికారులే ఇప్పుడూ ఉన్నారు.. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల
పాలనలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు.

ప్రస్తుతం చాలా చోట్ల ఇంటలిజెన్స్ ఫెల్యూర్ చాలా చోట్ల ఉందని అన్నారు. అవినీతి అధికారుల లిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది. ఇక వారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని
తెలిపారు. పోలీసుల వైఫల్యంతోనే భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య జరిగిందని అన్నారు.
సోమేశ్ కుమార్  బాగోతం ఇంకా బయటపడాలి.. సోమేశ్ అండతోనే జీఎస్టీ కుంభకోణం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో విచారణ చేయాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటంతో విచారణకు సమయం పడుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version