గత కొద్ది రోజులుగా అరెస్ట్ అయి విజయవాడ జైలులో వల్లభనేని వంశీ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే మాజీ సీఎం జగన్ కూడా పరామర్శించారు. తాజాగా పేర్నినాని, వంశీ భార్య జైలు వద్ద ములాఖత్ అయ్యారు. ములాఖత్ వద్ద తొలుత పోలీసులతో వాగ్వాదం జరిగిన తరువాత జైలు లోపలికి వారిని పంపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ మంగళవారానికి వాయిదా వేసింది.
వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్ల పై విజయవాడ ఎస్టీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్తానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా బెయిల్ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు.