నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

-

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనపై నిఘా ఏంటి అంటూ నిలదీశారు. ” నేనేమైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నా? నా దగ్గర 12 సిమ్ కార్డులు ఉన్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్ లో మాట్లాడితే ఏం చేయగలరు?ఏపీ పోలీసు బాసు కూడా నన్ను ఏమీ చేయలేరు.

35 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్న. ఎప్పుడు ఏమి చేయాలో నాకు తెలుసు ” అని వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా కోటంరెడ్డి సొంత పార్టీ పైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన నియోజకవర్గంలో పింఛన్ల కోత పై బాహటంగానే విరుచుకుపడ్డ కోటంరెడ్డి తాజాగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version