మనిషిని పోలిన మనుషులు ఎక్కడ ఉంటారో ఇలా తెలుసుకోవచ్చుగా..!!

-

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.. వినడమే తప్ప..చూసింది ఏం లేదు.. సినిమాల్లో చూపిస్తారు అంతే.. అసలు నిజంగా ఉంటారా..? ఉంటే వాళ్లు ఎక్కడ ఉంటారు.. తెలుసుకోవాలని ఉందా..? ఏడుగురు కాదు.. కనీసం ఒక్కరైనా.. దొరుకుతారా..? దొరుకుతారు.. టెక్నాలజీ సాయంతో మనిషిని పోలిన మనుషులను కూడా కనిపెట్టేయొచ్చట..! ఆశ్చర్యంగా ఉంది కదూ..! Twinstrangers.com అనే వెబ్‌సైట్‌. ఇదే పేరుతో ఓ యాప్‌ కూడా ఉంది. దీని సాయంతో కనిపెట్టొచ్చట..!
ఈ వెబ్‌సైట్‌ నుంచి చాలా మంది తమను పోలిన వ్యక్తులను కలుసుకున్నారట… ఆ క్షణంలో వారి ఆనందానికి అవధులు లేవు. అలా అమెరికాలోని నార్త్‌ కరోలినాకు చెందిన అంబ్రా, టెక్సాస్‌కు చెందిన జెన్నిఫర్‌ మీట్‌ అయ్యారు. వయసు రీత్యా ఇద్దరికీ పదేళ్లు తేడా ఉంది.. కానీ, వారి ముఖ కవళికలు మాత్రం ఒక్కటిగానే ఉండటం ఆశ్చరకరమైన విషయం. ఇలా తమలాంటి పోలికలతో ఉన్న వ్యక్తులను కలుసుకున్న చాలామంది వారి అనుభవాలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు.

ఏం చేయాలంటే..

ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. సరైన పోలికలతో ఉన్నవారిని గుర్తించాలంటే మన అసలైన రూపం ఎలా ఉంటుందో అలా ఇందులో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫొటోలో మన ముఖం కచ్చితంగా మధ్యలోనే ఉండి తీరాలి. సైడ్‌ లుక్‌లో ఉన్న చిత్రాలు ఇందులో అప్‌ చేయడానికి పనికి రావు. పైగా ట్రాక్‌ చేయడం కష్టం అవుతుంది. ముఖంపై వెంట్రుకలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోరు, చెవులు అద్దంలో ఎలా కన్పిస్తుంటాయో అచ్చం అలాంటి ఫొటోనే ఇందులో అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత మీ జెండర్‌, పేరు, ఊరు, దేశం తదితర వివరాలన్నీ ఎంటర్‌ చేయాలి.. ప్రొఫైల్‌ గ్యాలరీలో మరో ఐదు రకాల ఫొటోలను అదనంగా జత చేయాల్సి ఉంటుంది.

ఎలా వెతుకుతుంది..?

ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత వెబ్‌సైట్‌లో కృత్రిమ మేధ సహాయంతో మన పోలికలు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. తరువాత మన ప్రొఫైల్‌ ఆధారంగా అప్పటికే రిజస్టర్‌ అయిన వారి ముఖాలను పోలుస్తూ.. అందులో మీలాగే ఉన్నవారి ఫొటోలను గుర్తించి ఒక ఫోల్డర్లో పంపిస్తుందట.. మీకు తగ్గ వ్యక్తి దొరికితే వారిని మై ట్విన్స్‌ ఫోల్డర్‌లోకి పంపించాలి. అప్పుడు అవతలి వ్యక్తి కూడా మీతో పరిచయం పెంచుకోవడానికి వీలుంటుంది. విభిన్న రకాల ఫొటోలు జత చేసే కొద్దీ మీ పోలికలు ఉన్న మరింత మంది వ్యక్తులను ఈ వెబ్‌సైట్‌లోని సాంకేతికత వెతికిపెడుతుంది..
క్రేజీగా ఉంది కదూ.. మీ లాంటి వారిని కనిపెట్టాలనుకుంటే.. ట్రే చేయండి.. అయితే ఇలా ఒక సైట్‌ ఉంది అని మాత్రమే మేం చెప్తున్నాం.. దీనికి ‘మనలోకం’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version