క్రేజీగా ఉంటుందిగా అని ఆ ట్రక్‌ ఎక్కారు.. బోర్లాపడటంతో బురదలో ఈదుకుంటూ…!!

-

తీటపనులు చేయడం చాలామంది ఇంట్రస్ట్‌ ఉంటుంది. ఒకపక్క భయం ఉన్నా.. చేద్దాం.. క్రేజీగా ఉంటుంది..లైఫ్‌ టైమ్‌ ఎక్సిపీరియన్స్‌ మళ్లీ మళ్లీ ఛాన్స్‌ వస్తుందా అనుకోని.. చేస్తారు.. పారాగ్లైడింగ్‌, భంగీజంప్‌లు చేసేవాళ్ల వీడియోస్‌ సోషల్‌ మీడియాలో మీరు చూసే ఉంటారు.. ఎంత భయపడతారు..అయినా లోపల ఒక తెలియని ఉత్సాహం..చేసేద్దాం అని.. ఇక్కడ వీళ్లు కూడా అలానే అనుకోని.. స్పెషల్‌ థ్రిల్‌ కోసం ఒక ట్రక్‌ ఎక్కారు. ట్రక్‌ ఎక్కితే ఏం థ్రిల్‌ అనుకుంటారా..? ఆ ట్రక్‌ ఫుల్‌ మడ్‌లోకి వెళ్తుంది.. వెళ్లేకొద్ది మునిగిపోయింది.. ట్రక్‌ ఎక్కి పైన కుర్చున వాళ్లకు అదో క్రేజీ ఫీలింగ్.. కానీ అలా జరగలేదు.. ట్రక్‌ కాస్త బోర్లాపడింది.. అందులో ఉన్నవాళ్లు కిందపడ్డారు.
వైరల్ అవుతున్న వీడియోలో ట్రక్‌పై నిలబడి చాలా మంది నిలబడి బురదలోకి వెళుతున్నారు. వెళ్లే ముందు అందరికీ టాటా చెబుతూ.. సంతోషంగా వెళ్లారు. కొన్ని సెకన్లలో ట్రక్ ముందుకు వెళ్లింది.. చిత్తడి నేలలోకి వెళ్లింది. మొదట్లో బురదలోకి దిగే సమయంలో ప్రజల్లో ఉత్సాహంగా కేకలు వేసినా..కొన్ని సెకన్ల తర్వాత ఈ సాహసం ప్రమాదంగా మారింది. ట్రక్ బురద నీటిలోకి ప్రవేశించిన వెంటనే.. టైర్లు అటు ఇటు కదులుతూ లోపలికి వెళ్లిపోయాయి. ట్రక్కు పైన నిలబడి ఉన్న డజన్ల కొద్దీ ప్రజలు చిత్తడిలో పడిపోయారు. మరికొందరు బురద నీటిలోకి పడిపోకుండా ట్రక్‌ను గట్టిగా పట్టుకుని ఉండిపోయారు. అయితే డ్రైవర్ కూడా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. బురదలో పడిన వ్యక్తులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.. ట్రక్ అక్కడే బురదలో చిక్కుకుపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అనేక మంది ఈ వీడియోపై లైక్‌ల వర్షం కురిపిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు. మీలో చాలామంది వండర్లా వెళ్లే ఉంటారు. అక్కడ కొలంబస్‌ ఎక్కే సాహసం చేశారా.. అది కింద ఉండి చూసేవాళ్లకు బానే ఉంటుంది. ఎక్కాలి ఎక్కాలి అనిపిస్తుంది. తీరా ఎక్కాక ఉంటుంది..ఓరబ్బా, ఓరినాయనోనే అయిపోయింది.. ఆగం ఆగం జంబలకడి జారుమిఠాయే..! మీరు మీ లైఫ్‌లో ఇలాంటి సాహసాలు ఎప్పుడైనా చేశారా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version