కోవిడ్‌ టీకాకు వీరు దూరంగా ఉండాలి

-

కోవిడ్‌ టీకాకు సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడూ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. తాజాగా కోవిడ్‌ వ్యాక్సిన్‌కు ఎవరెవరు, ఎంత కాలం దూరంగా ఉండలానే అంశానికి సంబంధించి నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ బృందం రూపొందించిన నూతన మార్గదర్శకాలను కేంద్రం వెల్లడించింది. ఇక ఆ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

కోవిడ్ నుంచి కోలుకున్నవారు మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఎందుకంటే వారిలో కరోనాపై పోరాడే యాంటీబాడీలు తయారయ్యి ఉంటాయి. కాబట్టి వారు కొన్ని నెలల తర్వాత టీకా తీసుకుంటే మంచిదని తెలిపింది. అలానే మొదటి డోసు తీసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చిన వారు కూడా కనీసం మూడు నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ప్లాస్మా థెరపీ చేయించుకున్నవారు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్రం సూచించింది.

తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వారందరూ టీకా తీసుకొనేందుకు టీకా కోసం నాలుగైదు వారాలు వేచి ఉండాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. టీకా తీసుకున్న వారు ఇంతకుముందున్న అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రుల్లో చేరితే వారు రెండు నెలల వరకు టీకా తీసుకోవడం వాయిదా వేయాలని పేర్కొంది.గర్భిణీలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలా వద్ద అంశంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకొనేవరకు గర్భిణీలు టీకా తీసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version