దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్

-

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో దొంగను వాట్సాప్ స్టేటస్ పట్టించింది. తాడేపల్లి డోలాస్ నగర్ లోని అపార్ట్మెంట్ లో విట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కత్తి అమోగ్ కుంటుంబం నివాసం ఉంట్నోంది. జూన్ నెలలో కర్ణాటక వెళ్ళిన సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ జరిగింది. 45 గ్రాముల బంగారం, ఖరీదైన చీరలు చోరీకి గురయ్యాయి.

తమ ఇంట్లో చోరీకి గురయిన చీరను కట్టుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడాన్ని అసిస్టెంట్ ఫ్రోఫెసర్ కుటుంబం గమనించింది. దీంతో అపార్ట్మెంట్ లో పని చేసిన సునీతపై అసిస్టెంట్ ప్రొఫెసర్  పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో సదరు సునీత అనే మహిళను అదుపులోకి తీసుకుని 1.80  లక్షల విలువైన  బంగారం, చీరలు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం మీద కొట్టేసిన చీర కట్టుకోవడం ఆమె కొంప ముంచింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version