వివాహ వార్షికోత్సవం: భార్యకు చంద్రుడిపై 3 ఎకరాలు

-

రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌ లోని ఒక వ్యక్తి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు చంద్రునిపై మూడు ఎకరాల ప్లాట్ ని బహుమతిగా ఇచ్చాడు. ధర్మేంద్ర అనిజా అనే వ్యక్తి తన ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య సప్నా అనిజా కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ నేపధ్యంలో చంద్రునిపై ప్లాట్ కొన్నాడు. డిసెంబర్ 24 న తమ వివాహ వార్షికోత్సవం అని ధర్మేంద్ర పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ కార్లు మరియు ఆభరణాలు వంటి భూమి మీద ఉండే వస్తువులను బహుమతిగా ఇస్తారు. కాని నేను వేరే పని చేయాలనుకుంటున్నాను. అందువల్ల, నేను ఆమె కోసం చంద్రునిపై భూమిని కొన్నాను అని అతను వివరించాడు. ధర్మేంద్ర అనిజా లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా భూమిని కొనుగోలు చేసాడు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టిందని ధర్మేంద్ర అనిజా తెలిపారు.

“నేను సంతోషంగా ఉన్నాను, రాజస్థాన్‌లో చంద్రునిపై భూమి కొన్న మొదటి వ్యక్తిని నేను అని భావిస్తున్నాను” అని ఆయన చెప్పారు. అతని భార్య మాట్లాడుతూ… “నేను చాలా సంతోషంగా ఉన్నాను, అతను నాకు ఇంత ప్రత్యేకమైనదాన్ని బహుమతిగా ఇస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు.” అని వెల్లడించారు. తమకు నిజంగా చంద్రుడిపై ఉన్నట్లు అనిపించింది అని వెల్లడించారు. కొన్ని నెలల క్రితం, బోధ్ గయా నివాసి అయిన నీరజ్ కుమార్ కూడా తన పుట్టినరోజున చంద్రునిపై ఎకరం కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version