తీన్మార్ మల్లన్న చానెల్ రిపోర్టర్స్ అంటూ వసూళ్ల దందా?.. వీడియో వైరల్!

-

నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న Q న్యూస్ & శనార్తి తెలంగాణకు చెందిన రిపోర్టర్స్ పేరిట ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేశారు. కొత్తగా ఓపెన్ చేసిన అరేబియన్ మండి యజమానిని డబ్బులు ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులు బెదిరించారు.

మల్లన్నతో కలిసి దిగిన ఫోటోను చూపిస్తూ మండి ఓనర్‌ను వారిద్దరూ బెదిరింపులకు గురిచేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అయితే, క్యూ న్యూస్ అసలు రిపోర్ట్సర్స్ వచ్చేసరికి నకిలీ వ్యక్తులు పరారు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అసలైన రిపోర్టర్స్ ఆ వ్యక్తులు ఎవరని ఆరా తీయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిపోర్టర్లు ఇటీవలి కాలంలో బడా వ్యక్తులను, వ్యాపారులను బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. గతంలోనూ క్యూ న్యూస్ చానెల్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news