తెలంగాణలో కల్లు, మటన్ కే వైబ్..దిల్ రాజు వివాదస్పద వ్యాఖ్యలు

-

తెలంగాణలో సినిమాలకు ఎక్కువగా వైబ్స్ ఇవ్వరు. తెల్ల కల్లు, మటన్ కే వైబ్స్ ఇస్తారని FDC చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఎక్కువగా సినిమాలకే వైబ్స్ ఇస్తారు. సంక్రాంతి పండుగ అంటే సినిమాలకే వైబ్స్ ఇస్తారని పేర్కొన్నారు. మరోవైపు తాను, శిరీష్ నిజామాబాద్ థియేటర్లలో సినిమాలు చూశాం. ఇష్టం పెంచుకున్నామని.. ఈ రంగంలోకి వస్తామనుకోలేదని తెలిపారు.

ఈ సినీ ప్రయాణం వెనుక ఎంతో మంది హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సహకారం ఉందని తెలిపారు. మా 58వ సినిమా వేడుకను ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనిత్ ప్రతీ సినిమాను ఎలా విజయవంతం చేయాలో ఆలోచిస్తాడు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మేము నిర్మిస్తే.. పండుగకు వస్తున్న డాకు మహారాజ్ సినిమాని కూడా మేమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news