స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో రూ.30లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది.
షిఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దొంగలు ATMలో చోరీకి పాల్పడినట్లు సమాచారం. దొంగతనానికి వచ్చిన వారు ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేసినట్లు తెలిసింది. మొత్తం నాలుగు నిమిషాల్లోనే ATMలోని డబ్బును దొంగిలించి దొంగలు పారిపోయారని సమాచారం. కాగా, ATMలో సుమారు రూ. 30 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.