IND Vs NZ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

-

ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు మొదటి స్థానంలో సెమీస్ లో ఆసీస్ తో పోటీ పడుతుంది. ఓడిన జట్టు సౌతాఫ్రికాతో సెమీస్ లో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. రెండు టీమ్ లు మంచి ఫామ్ లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లతో విజయం సాధించగా.. న్యూజిలాండ్ సైతం బంగ్లదేశ్, పాకిస్తాన్ జట్లతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కే.ఎల్.రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఫమీ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

న్యూజిలాండ్ జట్టు : యంగ్, కాన్వే, విలియమ్సన్, రవీంద్ర, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్ వెల్, మిచెల్ శాంట్నర్, హెన్రీ, జెమిసన్, విల్ ఓ రూర్కె.

Read more RELATED
Recommended to you

Latest news