GOOD TO KNOW ప్లాట్ కొంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

-

హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది దాదాపు ప్రతి ఒక్కరి కలే. ఎందుకంటే.. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచంలోని అన్ని నగరాలతో పోటీ పడుతోంది. హైదరాబాద్ మెట్రో సిటీలో ఉంటే.. ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నట్టే. ఉద్యోగాలకూ కొదవ లేదు. చదువుకు సంబంధించి కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. మరోవైపు రియల్ ఎస్టేట్ బూమ్ కూడా హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కొందరు పెట్టుబడి కోసం మరికొందరు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్‌లో ప్లాట్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో కష్టపడి.. రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బును వృథా చేస్తే ఏమొస్తది.. ఏం రాదు. అందుకే.. ప్లాట్ కొనేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించారు. ఆవేశపడకూడదు. బ్రోకర్ల మాట అస్సలు వినొద్దు. తొందరపడి ప్లాట్ కొనేశాక.. దానిలో ఏవైనా సమస్యలు ఉండే మీ ఏళ్ల కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే.. మీరు ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఆ ప్లాట్ కింద పేర్కొన నియమాలకు లోబడి ఉందో లేదో చెక్ చేసుకోండి.

జీహెచ్‌ఎంసీ లేదా హెచ్‌ఎండీఏ లేదా డీటీసీపీ ద్వారా అనుమతించబడిన లేఅవుట్లలోనే ఓపెన్ ప్లాటును కొనుగోలు చేయండి. లేదా ఆ ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్ తీసుకొని అయినా ఉండాలి. ఎల్‌ఆర్‌ఎస్ అంటే క్రమబద్ధీకరణ.

ఒకవేళ ఆ ప్లాట్ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీలలో ఏ సంస్థ ద్వారా కూడా అప్రూవ్డ్ కాకుంటే.. 28-10-2015కు ముందు… అంటే ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ డేట్‌కు ముందు దానికి లింకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన అయి ఉండాలి.

ప్లాట్ కొనడానికి ముందే ఈసీ(ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్) తీసుకొని రిజిస్ట్రేషన్ టైటిల్ డీడ్ క్లియర్‌గా ఉందా లేదా సరిచూసుకోవాలి.

ప్రభుత్వ భూమి, సీలింగ్, చెరువు శిఖానికి చెందింది, ఎఫ్‌టీఎల్, రైల్వే లైన్లు, నాలాలు, చెరువల బఫర్ జోన్‌లోకి వచ్చే ప్లాట్లను కొనవద్దు. వాటి పరిధిలో ఉన్న ప్లాట్లకు ఎటువంటి అనుమతులు లభించవు.

లేఅవుట్ ఓపెన్ ప్లేస్, పార్కుల కోసం వదిలిన స్థలాల్లోనూ ప్లాట్లు తీసుకోకూడదు. వాటికి కూడా నిర్మాణ అనుమతులు రావు. తెలియకుండా ఆ ప్లాట్‌ను తీసుకుంటే దాన్ని తిరిగి అమ్మడానికి కూడా కుదరదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version