ఈ బ్యాంక్ పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ పనిచేయవు..!

-

మీకు ఈ బ్యాంకులలో ఖాతా ఉంటే తప్పక ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ గురించి తెలుసుకోండి. లేదు అంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. విలీనం అయిన బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ పని చేయవు కాబట్టి ఆయా బ్యాంకుల కస్టమర్లు కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ తెలుసుకోవాలి.

లేదు అంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్, మనీ ట్రాన్స్‌ఫర్‌లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పలు బ్యాంకులను విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 10 బ్యాంకులు కాస్తా 4 పెద్ద బ్యాంకులుగా అయ్యాయి. విలీనం అయిన బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ ఇక పనిచేయవు గమనించండి. ఇప్పుడు కొత్త కోడ్స్ అమల్లోకి వచ్చాయి. వాటిని కస్టమర్స్ తెలుసుకోవాలి.

సిండికేట్ బ్యాంక్, అలాహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులకు చెందిన పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ పనిచేయవు గమనించండి.

అయితే కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అయ్యాయి.

అలానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం అయ్యాయి. ఎవరి నుంచి పేమెంట్స్ రావాలో వారికీ కొత్త ఐఎప్ఎస్‌సీ కోడ్స్ ఇవ్వాలి అలానే కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ తెలుసుకున్న తర్వాత బెనిఫీషియరీస్ లిస్ట్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version