ఇది బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ- బార్ల తెలంగాణ: వైయస్ షర్మిల

-

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. పరిపాలన అంటే వైయస్సార్ ది అని చెప్పారు. కెసిఆర్ ను ఎందుకు ముఖ్యమంత్రి చేశాము అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని, కెసిఆర్ తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగం, నిరుద్యోగానికి కారణం కేసీఆర్. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు కావా? ఈ పాపం ముమ్మాటికి కెసిఆర్ దే అని మండిపడ్డారు షర్మిల. ప్రతి ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కెసిఆర్ కి తెలిసింది ఒక్కటే ఫామ్ హౌస్ కి వెళ్లి పడుకోవడం. కెసిఆర్ ని ముఖ్యమంత్రి అని కాదు మోసగాడు, హంతకుడు అనాలి ఆన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ- బార్ల తెలంగాణ అయిందని ఎద్దేవా చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version