ఇదే మాకు లాస్ట్ చాన్స్.. బాక్సింగ్ డే టెస్టు ఓటమిపై రోహిత్ శర్మబాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచిన విషయం తెలిసిందే. తాజా ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈ మ్యాచ్ డ్రా అయినా తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, అనుహ్యంగా ఆస్ట్రేలియా జట్టు పుంజుకుని టీమిండియాను దారుణంగా దెబ్బతీసింది. ఒకానొక టైంలో ఇండియా విజయం ఖాయం అని అంతా భావించారు. జైస్వాల్, పంత్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందిస్తూ.. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఓటమి నిరాశపర్చిందన్నారు. బుమ్రా ప్రదర్శన అద్భుతంగా ఉండిందని, సెంచరీ హీరో నితీశ్ కుమార్‌కు మంచి కెరీర్ ఉందని చెప్పారు. కెప్టెన్, బ్యాటర్‌గా కొన్ని ఫలితాలు తనను నిరాశ పరిచాయని తెలిపారు. 340 రన్స్ టార్గెట్ ఈజీ కాదని, జట్టుగా కొన్ని అంశాల్లో మెరుగావ్వాల్సి ఉందన్నారు. సిడ్నీ టెస్టు తమకు చివరి అవకాశం అని, ఐదో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.