ఎగ్జిట్ పోల్స్ పై ప్రశాంత్ కిషోర్ రియాక్షన్ ఇదే..!

-

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అయినాయి.ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం పలువురు జర్నలిస్టులు, కొంతమంది నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పనికిరాని చర్చలు, విశ్లేషణలతో సమయాన్ని వృథా చేయవద్దని,చాలా ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేకు భారీ మెజారిటీ వస్తుందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగలదని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ వాదించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుంది అని గుర్తు చేశారు.

ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, “నా అంచనా ప్రకారం బిజెపి మునుపటి సంఖ్యలకు దగ్గరగా లేదా కొంచెం మెరుగ్గా తిరిగి రాబోతోంది. ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ, తమిళనాడులో పార్టీ తన ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడు, కేరళలో ఎన్‌డిఎ తన ఖాతాను తెరుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో దాని అద్భుతమైన పనితీరు కొనసాగుతుంది. రాజస్థాన్, మహారాష్ట్ర,బీహార్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుముఖం పట్టవచ్చు’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version