ఇండియన్ 2 విషయంలో శంకర్ మార్క్ మిస్ అవుతుందా…?

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది జూన్12, 2024న లో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ ఆడియో లాంచ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. విక్రమ్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినందుకు గాను అనిరుద్ ని కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కోసం రెఫర్ చేసారు.అయితే ప్రస్తుతం అనిరుద్ అందించిన సాంగ్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు.గతంలో వచ్చిన ఇండియన్ మూవీ సాంగ్స్ అంతటి ఘన విజయం సాధించడానికి కారణం ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సాంగ్స్ అని చెప్పవచ్చు.అప్పట్లో ఆ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే పాటల విషయంలో ఎంతో కేర్ తీసుకునే శంకర్ ఇండియన్ 2 విషయంలో మిస్టేక్ చేసారా అని ,ఇండియన్ 2 విషయంలో శంకర్ మార్క్ మిస్ అవుతుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version